వేయి పేజీల కన్నా ఎక్కువ ఉండే నవల ఏదైనా.. అందరికీ చదవాలనిపించేలా రచించేందుకు.. రచయితలు సుమారు పదేళ్లు తీసుకుంటారు. 18వ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన 'లె మిజరబుల్స్' అనే పుస్తకం కోసం.. ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో తీసుకున్న సమయం 12 ఏళ్లు. 'గాన్ విత్ ద విండ్' అనే వెయ్యి 43 పేజీల నవల రచనకు.. మార్గరెట్ మిషెల్ అనే రచయిత పదేళ్లు కేటాయించారు. అందరినీ ఆకట్టుకుంటున్న'జురాసిక్ పార్క్' నవల కోసం.. మైకెల్ క్రిచ్‌టన్ కూడా అంతే సమయం తీసుకున్నారు. అయితే.. విజయవాడకు చెందిన రచయిత పూలబాల వెంకట్.. తన వృత్తపద్యాలతో గ్రాంథిక తెలుగు ఉపయోగించి రాసిన 'భారతవర్ష' అనే నవలను.. కేవలం 8 నెలల్లో రచించి.. సొంతంగా కంపోజ్ చేసి ముద్రించారు.
రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో విశిష్ఠ సేవలు..
రెండు దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందించి.. దశాబ్దకాలంగా రచనారంగంతో పెనవేసుకున్నారీయన. విదేశీభాషల్లో విశిష్ఠస్థానం సంపాదించుకున్న వెంకట్ పూలబాల.. ఆంగ్ల వార్తాపత్రికల్లో కాలమ్స్ రాస్తూ వచ్చారు. ఆంగ్లంతో పాటు.. జపనీస్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, ఆంగ్ల, భాషలను భోదించడం సహా.. చక్కగా మాట్లాడగల బహుభాషా కోవిదుడు. ఫ్రెంచ్‌లోనూ నవల రాసిన తొలి భారతీయుడిగా పేరు సంపాదించిన వెంకట్ పూలబాల.. మాతృభాషలో భారతవర్ష రచించారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!