ముఖ్యమంత్రి జగన్ రాజకీయ ప్రస్థానంపై ఓ పుస్తకం ఆవిష్కృతమైంది. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాయర శేఖర్ బాబు రచించిన 'నేను విన్నాను.. నేను ఉన్నాను' అనే పుస్తకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడలో ఆవిష్కరించారు. జగన్ రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారని చెప్పారు. వైకాపా అధినేతగా ప్రజలకు ఇచ్చిన హామీలను.. ముఖ్యమంత్రిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు, శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో నూతన వరవడిని సృష్టిస్తున్నారని అన్నారు.
"జగన్ రాజకీయ ప్రస్థానంపై పుస్తకం" - vellampally
సీఎం జగన్ రాజకీయ ప్రస్థానంపై 'నేను విన్నాను..నేను ఉన్నాను' అనే పుస్తకం ఆవిశృతమైంది. బిసి ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాయర శేఖర్ బాబు రచించిన ఈ పుస్తకాన్ని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
పుస్తకం ఆవిష్కరణ