తెదేపా బలోపేతానికి కృషి చేస్తా: బొండా - bonda uma maheswara rao
పార్టీ మార్పు ఊహాగానాలను తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఖండించారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.
పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని.. తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ తేల్చి చెప్పారు. తాను తెదేపాను వీడడం లేదని స్పష్టం చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం.. ఆయన ఈ విషయాలపై వివరణ ఇచ్చారు. తాను దేశంలో లేని సమయంలో అసత్య ప్రచారం జరిగిందని మండిపడ్డారు. ''తెదేపాను వీడాల్సిన అవసరం నాకు లేదు. పార్టీ మారే వాడినే అయితే అధినేత దగ్గరికి ఎందుకు వస్తాను?'' అని ఉమ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనతో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా పార్టీ కోసం పని చేస్తానని తెలిపారు.