ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2019, 8:09 PM IST

ETV Bharat / city

'వైకాపా పాలనలో వేధింపులు... సాధింపులే ఎక్కువ'

ఆర్థికంగా వెనుకబడిన పేద విద్యార్థులు, నిరుద్యోగులు వైకాపా పాలనలో ఇబ్బందులు పడుతున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు విమర్శించారు. ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్పొరేషన్‌లకు బడ్జెట్​లో కేటాయించిన నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు

గతంలో అన్ని వర్గాలను ఆదుకున్నది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమేనని మాజీఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. బ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి కృషి చేసిందని వివరించారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు... ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్​లకు ఇవ్వలేదని ఆరోపించారు.

కాపు కార్పొరేషన్​కు రూ.2వేల కోట్లు కేటాయించినా... ఇప్పటిదాకా నిధులు మంజూరు చేయలేన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా మహిళలకు రుణాలు, స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపాకు పరిపాలన అనుభవం లేక పేదప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు

ఇదీ చదవండీ... 'ఉగాది నాటికి పేదలందరికీ ఉచితంగా ఇళ్ల పట్టాలు'

ABOUT THE AUTHOR

...view details