తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ కలిశారు. కొద్దిరోజులుగా బొండా ఉమా పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఆయన చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.. ఇప్పటికే బొండా ఉమతో చర్చలు జరిపారు. తెదేపాలోనే కొనసాగుతానని బొండా.... బుద్ధా వెంకన్నకు హామీ ఇచ్చారు. బొండా ఉమ చంద్రబాబుతో ఏం మాట్లాడారనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.
పార్టీ మార్పుపై.. చంద్రబాబుకే చెప్పేసిన బొండా ఉమ! - chandra babu
మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ... తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. ఉమ పార్టీ మారుతున్నారనే ఊహాగానాల నేపథ్యంలో... ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
బొండా ఉమ