ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పురపాలిక ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్​ ఇవ్వాలి: భాజపా - ఎన్నికల వార్తలు

పురపాలక ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్​ విడుదల చేయాలని ఎస్​ఈసీని భాజపా నేతలు కోరారు. రాష్ట్రంలో జరిగిన ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యస్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆక్షేపించారు.

bjp complained to sec
పురపాలికలకు కొత్త నోటిఫికేషన్​ ఇవ్వాలి: భాజపా నేతలు

By

Published : Feb 16, 2021, 7:04 PM IST

పురపాలక ఎన్నికలకు గతంలో ఇచ్చిన పాత నోటిఫికేషన్​ను రద్దు చేసి తిరిగి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. రాష్ట్రంలో జరుగుతోన్న ఏకగ్రీవాలు ప్రజాస్వామ్యస్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని భాజపా నేతలు ఎస్ఈసీ కార్యదర్శి కన్నబాబుకు ఫిర్యాదు చేశారు.

దాడులు అరికట్టండి:

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేసి తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్టు నేతలు తెలిపారు. దీని వల్ల అనేక మంది పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరినట్టు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో భాజపా అభ్యర్థిపై అధికారపార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. భాజపా నేతలపై దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీని కోరినట్టు తెలిపారు.

ఇదీ చదవండి:

'నాలుగో విడత ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలి'

ABOUT THE AUTHOR

...view details