ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Somu Veeraju: పరిపాలన అంటే అప్పులు చేయడం..గిఫ్టులు ఇవ్వడం కాదు: సోము వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై పెద్ద దుమారం లేచిందని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విశాఖలో.. తహసీల్దారు కార్యాలయాలు, సర్క్యూట్ హౌస్ అమ్మేదామని చూస్తున్నారని..ఉపేక్షిస్తే భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఇంటినీ అమ్మకానికి పెడతారేమోనని ఎద్దేవా చేశారు.

bjp leader somu veeraju fires on ycp over job calender
తహశీల్దారు కార్యాలయాలు, సర్క్యూట్ హౌస్ అమ్మేదామని చూస్తున్నారు: సోము వీర్రాజు

By

Published : Jun 22, 2021, 2:27 PM IST

Updated : Jun 22, 2021, 11:03 PM IST

పరిపాలన అంటే అప్పులు చేయడం కాదు, గిఫ్టులు ఇవ్వడం కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై పెద్ద దుమారం లేచిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు పరిపాలన రాదని విమర్శించారు. విశాఖలో.. తహసీల్దారు కార్యాలయాలు, సర్క్యూట్ హౌస్ అమ్మేద్దామని చూస్తున్నారని..ఉపేక్షిస్తే భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఇంటినీ అమ్మకానికి పెడతారేమోనని ఎద్దేవా చేశారు.

అశోక్‌ గజపతిరాజును ఉద్దేశించి విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను సోము వీర్రాజు ఖండించారు. వ్యవసాయ రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు. విశాఖ భూముల వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

కడపలో టిప్పు సుల్తాన్ విగ్రహం... ఈ సమయంలో అవసరమా అని సోము వీర్రాజు అన్నారు. విశాఖ భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టడానికి భాజపా వ్యతిరేకం అని చెప్పారు. విశాఖ భూములు వ్యవహారంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ చేయించాలన్నారు.

ఇదీ చదవండి:గొర్రెల పెంపకందారులను మోసగించిన వ్యాపారి.. రూ.40 లక్షలకు టోపీ

Last Updated : Jun 22, 2021, 11:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details