రాష్ట్రంలో వెయ్యి రూపాయల ఆర్ధిక సాయం తెల్లరేషన్ కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేస్తున్నారని... ఇందులో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపించారు. కులాలు, మతాల వారీగా పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. పొరుగు రాష్ట్రాల్లో మెరుగైన సాయం అందజేస్తున్నారని తెలిపారు. మరోవైపు నగదు పంపిణీ పేరుతో వైకాపా నేతలు రాజకీయం చేస్తుండడం దురదృష్టకరమని ఆమె అన్నారు. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్న అఖిలప్రియ... పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులు వైకాపా నాయకుల్ని క్షమించరన్నారు. క్షేత్రస్థాయిలో పని చేసే వారికి మాస్క్లు, గ్లౌజులు, శానిటైజర్లు పంపిణీ చేయాలని కోరారు. ఓ వైపు డబ్బులు లేవంటున్న జగన్ 6 వేల 400 కోట్ల రూపాయల బిల్లులను విడుదల చేయడం దౌర్భాగ్యమని ధ్వజమెత్తారు.
ఆర్థిక సాయంలో అవకతవకలు: భూమా అఖిల ప్రియ
కరోనాను అరికట్టడంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కోరారు. తెల్లరేషన్ కార్డు దారులకు ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల ఆర్థిక సాయంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ