భవానీ దీక్షలకు సంబంధించిన పోస్టర్లును దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్ సోమినాయుడు విష్కరించారు. ఈ ఏడాది 8-9 లక్షలమంది భవానీ దీక్షలు(Bhavani Deeksha Schedule Release) తీసుకుంటారని అంచనా వేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు ఆయన తెలిపారు. ఉచిత భోజన వితరణకు ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎంతమంది మాల వేస్తున్నారో చెప్పాలని గురుస్వాములకు సూచించారు.
దేవస్థానం వెల్లడించిన దీక్షధారణల వివరాలు(Bhavani Deeksha Schedule announced)
- ఈ నెల 15 నుంచి భవానీ మండల దీక్షధారణలు
- ఈ నెల 15 నుంచి 19 వరకు భవానీ మండల దీక్షధారణలు
- డిసెంబరు 5 నుంచి 9 వరకు భవానీ అర్ధమండల దీక్షలు
- డిసెంబరు 18న సాయంత్రం 6.30 గం.కు కలశజ్యోతి ఉత్సవం
- డిసెంబరు 25 నుంచి 29 వరకు శతచండీయాగం, గిరిప్రదక్షిణలు
- డిసెంబరు 25 నుంచి 29 వరకు భవానీ దీక్షల విరమణ
- డిసెంబరు 29న ఉ.10.30 గం.కు పూర్ణాహుతి భవానీ దీక్ష విరమణ
- ఉదయం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆలయంలో దర్శనాలు
- ఉచిత దర్శనం, రూ.100 టికెట్లు ఆన్‌లైన్‌లో పొందేందుకు ఏర్పాట్లు