బోయిన్పల్లి అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవరామ్... ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. కేసులో ఏ-3 నిందితునిగా ఉన్న తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సికింద్రాబాద్ న్యాయస్థానాన్ని కోరాడు. ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన పిటిషన్లో పేర్కొన్నాడు.
కిడ్నాప్ కేసు: ముందస్తు బెయిల్ కోసం భార్గవరామ్ పిటిషన్ - akhila priya case latest updates
తెలుగు రాష్ట్రాల్లో సంచలం సృష్టించిన బోయిన్పల్లి అపహరణ కేసులో నిందితుడిగా ఉన్న భార్గవరామ్... ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ప్రవీణ్ రావు సోదరుల అపహరణ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని..,ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సికింద్రాబాద్ న్యాయస్థానాన్ని కోరాడు.
అఖిలప్రియను కూడా ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని... ఏ-1 గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని ఏ2 గా మార్చి కేవలం నోటీసులు ఇచ్చి పంపారని పిటిషన్లో పేర్కొన్నారు. వ్యాపారరీత్యా హైదరాబాద్లో స్థిరపడ్డానని..పోలీసులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి సహకరిస్తానని తెలిపారు. దర్యాప్తునకు ఎలాంటి ఆటంకం ఉండదని.. భార్గవ్ పిటిషన్లో తెలిపాడు. భార్గవరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై బోయిన్పల్లి పోలీసులకు నోటీసులు జారీ చేసిన సికింద్రాబాద్ న్యాయస్థానం.. ఈ నెల 21వ తేదీకి విచారణ వాయిదా వేసింది.