- హైకోర్టు స్టేటస్‌కోపై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ
హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అదేరోజు అమరావతిలో ఇళ్లస్థలాల పంపిణీ, ఆర్-5 జోన్‌పై పిటిషన్లు విచారణకు రానున్నాయి. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై అమరావతి ఐకాస, రైతులు కేవియట్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- కన్నతండ్రి కర్కశత్వం... సీసీ ఫుటేజ్‌లో నిక్షిప్తం..!
విశాఖ జిల్లా పెందుర్తి చిన్నముసిడివాడలో కుటుంబ కలహాలతో.. తండ్రి వీర్రాజు (70) కుమారుడు జలరాజు (40)ను సుత్తితో కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం పెందుర్తి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ హత్యకు సంబంధించిన సీసీ ఫుటేజ్ లభించింది. ఈ వీడియోలో తండ్రి వీర్రాజు... సాధారణంగా నడుస్తున్నట్టు చేసి సమీపంలో ఉన్న సుత్తిని తీసుకుని కుమారుడు జలరాజు తలపై బలంగా కొట్టారు. దీంతో జలరాజు అక్కడికక్కడే కుప్పకులాడు. ఆగిఆగి కొడుతున్న దృశ్యాలు మీరు చూడవచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- శిరోముండన కేసుపై డీజీపీకి వర్ల రామయ్య లేఖ
శిరోముండన కేసు దర్యాప్తు వ్యక్తిగతంగా సమీక్ష చేయాలంటూ తెదేపా నేత వర్ల రామయ్య డీజీపీ గౌతం సవాంగ్ కు లేఖ రాశారు. ఎస్సైని ఎవరో రెచ్చగొట్టారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- సొమ్ము ఎన్జీవోల ఖాతాల్లోకి ఎలా వెళ్లింది?'
రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఆ శాఖ అధికారుల బాధ్యతా రాహిత్యం వల్లే జూలై 30న పింఛన్లకు సంబంధించిన రూ.2800 కోట్లు ఎన్జీవోల అకౌంట్లకి వెళ్లాయని తెదేపా నేత దేవినేని ఉమా అన్నారు. జరిగిన తప్పిదానికి బాధ్యత వహిస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ
నీలం-జీలం నదిపై చైనా భారీ డ్యామ్‌లు నిర్మించటాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు అక్కడి యువకులు. ముజఫరబాద్ నగరంలో చైనాకు వ్యతిరేకంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
- 'రాజ'కీయం: షేక్ చేసి.. షేక్ హ్యాండ్ ఇచ్చి!