ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విజయవాడలో 'బాపు దర్శన్' పేరుతో ఫోటో ఎగ్జిబిషన్

మహాత్ముని జయంతి సందర్భంగా విజయవాడ నాస్తిక్ కేంద్ర ఆవరణలో బాపు దర్శన్ పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.

Bapu Darshan  photo exhibition set up  in vijayawada
విజయవాడలో 'బాపు దర్శన్' పేరుతో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు

By

Published : Oct 2, 2020, 8:15 AM IST


ఆంధ్రప్రదేశ్‌ గాంధీ స్మారక నిధి, వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో విజయవాడ నాస్తిక్‌ కేంద్రం ఆవరణలో బాపు దర్శన్‌ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు. మహాత్మాగాంధీ, కస్తూర్బా గాంధీల 150వ జయంతి సందర్భంగా ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ గత ఏడాది నెలకొల్పారు.

గాంధీ నేషనల్‌ మ్యూజియం నుంచి ఫొటోలు తీసుకువచ్చి దీనిని ఏర్పాటు చేసినట్లు గాంధీ స్మారక నిధి ప్రతినిధి రేష్మ తెలిపారు. ఎంతోమంది పాఠశాల చిన్నారులు ఈ ఎగ్జిబిషన్​ను ఆసక్తిగా తిలకించారన్నారు. గాంధీ క్రమశిక్షణ గురించి నేటి పిల్లలకు తెలియాల్సిన అవసరముందన్నారు. 2019లో రాష్ట్రం మొత్తం మీద పాఠశాల కమిషన్‌ సహకారంతో పిల్లలకు గాంధీపై పోటీలు నిర్వహించి...విజేతలను సేవాగ్రామ్‌ ఆశ్రమానికి తీసుకువెళ్లామని తెలిపారు. పిల్లలు అక్కడ అనేక విషయాలు ఆసక్తిగా తెలుసుకున్నారన్నారు. ఈ ఏడాది కరోనా కారణంగా పోటీలను నిర్వహించలేకపోయామన్నారు. గాంధీపై ఒక పుస్తకాన్ని రూపొందించినట్లు ఈ సందర్భంగా రేష్మ చెప్పారు.

ఇదీ చదవండి:గాంధీ జయంతి: సత్యాగ్రహ నినాదం.. నిశ్శబ్ద పోరాటం

ABOUT THE AUTHOR

...view details