తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ చేసిన అవినీతిని ఎర్రన్నాయుడు బయటపెట్టినందుకే అచ్చెన్నాయుడిపై కక్ష కట్టారని బండారు సత్యనారాయణ ఆరోపించారు. గతంలో తనకు శిక్షపడేలా వాదించినందుకే దమ్మాలపాటి శ్రీనివాస్‌పై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో సొంత బాబాయి హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించడానికి వెనుకాడిన జగన్, నేడు ప్రతిదానికీ సీబీఐ విచారణ అనడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానన్న వ్యక్తి, 23 మంది ఎంపీలు, 6గురు రాజ్యసభ్యులను చేతిలో ఉంచుకొని, ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారని బండారు ధ్వజమెత్తారు.
అందరీ దృష్టి మళ్లించడానికి జగన్ తంటాలు: బండారు
అవినీతిపరుల సంగతి తేల్చండని సుప్రీంలో వేసిన పిటిషన్‌తో తనకు ముంపు ముంచుకొస్తుందని జగన్‌కు అర్థమై.. సిట్ విచారణ పేరుతో దృష్టి మళ్లించడానికి తంటాలు పడుతున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. తెదేపా నేతలపై కక్ష కట్టారని ఆరోపించారు.
అందరిని దృష్టి మళ్లించడానకి జగన్ తంటాలు: బండారు