జగన్ ప్రభుత్వం అన్ని హామీల్లోనూ మాటమార్చి ప్రజలను మభ్య పెడుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. రద్దుల ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. అవకాశవాద రాజకీయాలకు అనుగుణంగా పాలన నడుపుతున్నారని బచ్చుల ధ్వజమెత్తారు. కక్ష సాధింపు తప్ప ప్రజా ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలను జగన్ పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వానికి పేదవాడి ఉసురు ఖచ్చితంగా తగులుతుందన్నారు.
"రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది" - bachula arjunudu
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. ప్రజా ప్రయోజనాలను వదిలేసి, స్వప్రయోజనాల కోసం పని చేస్తోందని ఆరోపించారు.
తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు