ఆయుష్ కుటుంబ సంరక్షణ కిట్‌ను ఆ విభాగం కమిషనర్ రాములు విజయవాడలో ప్రారంభించారు. డా.ఆచంట లక్ష్మీపతి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో.. నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఇంప్‌కాప్స్ సహకారంతో ఔషధ పంపిణీ చేపట్టనున్నారు. త్వరలో 3 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఇంటింటికీ హోమియో మందు పంపిణీ ఉంటుందని రాములు తెలిపారు.
ఆయుష్ జోక్యం లేదు..
ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీ అంశం హైకోర్టులో ఉందని తెలిపిన కమిషనర్ రాములు.. కంటి చుక్కల మందు పంపిణీపై నేడు తీర్పు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆనందయ్య ఔషధ పంపిణీలో తాము జోక్యం చేసుకోవట్లేదని వివరణ ఇచ్చారు. హైకోర్టు సూచనల మేరకు ఆయుష్ విభాగం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు.