తెలంగాణ భీం అధ్యక్షుడు సుజిత్ రావణ్‌పై కత్తుల దాడి జరగటం అవాస్తవమని పోలీసులు తేల్చారు. తనపై అర్థరాత్రిపూట గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసినట్టు సుజిత్ రావణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ద్విచక్రవాహనంపై బంజారాహిల్స్‌లోని నివాసానికి వెళ్తుండగా... ఖైరతాబాద్ కూడలిలో కారులో వచ్చిన కొందరు వ్యక్తులు తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
పోలీసులను తప్పుదోవ పట్టించిన తెలంగాణ భీం అధ్యక్షుడు
తనపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారని తెలంగాణ భీం అధ్యక్షుడు సుజిత్ రావణ్ ఫిర్యాదు చేశాడు. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా... సీసీ ఫుటేజీలో అసలు విషయం బయటపడింది. తమను తప్పుదోవ పట్టించాడని పోలీసులు గ్రహించారు. అసలేం జరిగిందంటే...!
పోలీసులను తప్పుదోవ పట్టించిన తెలంగాణ భీం అధ్యక్షుడు
పోలీసుల దర్యాప్తు చేస్తున్న క్రమంలో... సీసీ దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం బయటపడింది. నివాసానికి వెళ్తున్న సుజిత్రావణ్... ద్విచక్రవాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అదుపుతప్పి సుజిత్... గ్రిల్స్‌పై పడ్డాడు. ఈ ప్రమాదాన్ని ఆసరాగా చేసుకుని తమను తప్పుదోవ పట్టించినట్టు పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించిన సీఎం జగన్