New Judges: ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురి నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తులుగా నియమితులైన వారిలో కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తల్లాడ రాజశేఖరరావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన వారు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్ ప్రశాంత్ కుమార్ మిశ్ర.. వారిచే ప్రమాణం చేయించనున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయవాదులు కోటా నుంచి న్యాయమూర్తుల నియామకానికి ఏడు పేర్లను జనవరి 29 న కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ సిఫారసులకు కేంద్ర ప్రభుత్వం నోటిపై చేయడంలో నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు.