ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దేశాన్ని అమ్మాలనే ఆలోచనలను కేంద్రం మానుకోవాలి: శైలజానాథ్ - వైకాపాపై శైలజానాథ్​ విమర్శలు

వైకాపా, భాజపాకు మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ ఆరోపించారు. అందువల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించడం లేదని అన్నారు.

apcc
'వైకాపా, భాజపా మధ్య లోపాయికారి ఒప్పందం'

By

Published : Feb 7, 2021, 5:52 PM IST

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎంతోమంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న పరిశ్రమను ప్రైవేట్ పరం చేసి... ఆంధ్రుల ఆత్మగౌరవంతో ఆటలాడాలనుకోవడం మంచిది కాదని ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాధ్ కేంద్రాన్ని హెచ్చరించారు. దేశాన్ని అమ్మాలనే ఆలోచనలను మానుకోవాలని భాజపా ప్రభుత్వానికి హితవు పలికారు.

భాజపాతో కలిసిపోయినందునే.. ముఖ్యమంత్రి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై స్పందించడం లేదని ఆరోపించారు. వైకాపా, భాజపా మధ్య లోపాయకారి ఒప్పందం ఉండటం వల్లే మోదీ మాటకు జగన్ ఎదురు చెప్పలేకపోతున్నారని శైలజానాథ్ విమర్శించారు. ఇలాంటి నేతలు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం ప్రజల దౌర్భాగ్యమని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details