ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ పోలీస్ శాఖకు జాతీయస్థాయిలో పది అవార్డులు - ఏపీ పోలీస్ శాఖకు టెక్ అవార్డ్స్​ న్యూస్

సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో ఏపీ పోలీసు శాఖ జాతీయ స్థాయిలో పది అవార్డులను సొంతం చేసుకుందని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 26 అవార్డులను పోలీస్ శాఖ దక్కించుకుంది.

ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో పది అవార్డులు
ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో పది అవార్డులు

By

Published : Aug 25, 2020, 7:15 PM IST

ఏపీ పోలీస్​ శాఖ తాజాగా వివిధ విభాగాల్లో పది 'టెక్నాలజీ​ సభ' అవార్డులను కైవసం చేసుకుంది. టెక్నికల్ విభాగంలో-7, అనంతపురం జిల్లాకు 2, సీఐడీ 4ఎస్​ 4యూ విభాగానికి ఒక అవార్డు దక్కింది. హోం క్వారంటైన్ అప్లికేషన్, ఈ-హంట్, ఏపీ పోలీసు సేవ మెుబైల్ అప్లికేషన్​, రేస్, ఈ-పాస్, టైర్-3 డాటా సెంటర్, వినూత్న రీతిలో డ్రోన్ వినియోగం, హై అలెర్ట్ , 4ఎస్4యూలను సాంకేతిక పరిజ్ఞానంతో వినియోగిస్తున్నందుకు అవార్డులు లభించాయని డీజీపి తెలిపారు. వెబినార్ ద్వారా ఈ అవార్డులను అందుకున్నారు

ABOUT THE AUTHOR

...view details