ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 10, 2022, 4:36 PM IST

ETV Bharat / city

Scotch Awards: స్కోచ్ అవార్డుల్లో సత్తా చాటిన ఏపీ పోలీసు శాఖ

2021 సంవత్సరానికి గానూ.. "స్కోచ్" అవార్డుల్లో ఏపీ పోలీసులు అగ్రస్థానంలో నిలిచారు. వివిధ విభాగాల్లో 23 అవార్డులు గెలుచుకున్నారు. ఏపీ పోలీస్ శాఖ వరుసగా 2020, 2021లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది.

స్కోచ్ అవార్డుల్లో సత్తా చాటిన ఏపీ పోలీసు శాఖ
స్కోచ్ అవార్డుల్లో సత్తా చాటిన ఏపీ పోలీసు శాఖ

పోలీస్, రక్షణ విభాగంలో "స్కోచ్" సంస్థ ప్రకటించిన అవార్డుల్లో ఏపీ పోలీస్ శాఖ వరుసగా 2020, 2021లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. స్కోచ్ జాతీయ సంస్థ ప్రకటించిన మెుత్తం 56 అవార్డులల్లో 23 అవార్డులను ఏపీ పోలీస్ శాఖ సొంతం చేసుకుంది. ఒక స్వర్ణంతో పాటు ఎనిమిది రజత పతకాలను సాధించింది.

మహిళల భద్రత, నిర్ణీత సమయంలో చార్జ్​షీట్ల దాఖలు, పోలీస్ శాఖ పరిపాలనలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్ విధానం, క్లిష్టమైన కేసులను చేధించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విభాగాలల్లో అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందిని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details