నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఏపీ పాఠశాల పేరెంట్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. సమగ్ర అధ్యయనం తర్వాతనే నూతన జాతీయ విద్యా విధానం అమలుకు మొగ్గు చూపాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
నూతన విద్యా విధానంతో నిరుద్యోగ సమస్య ప్రబలడంతోపాటు ఉపాధ్యాయ నియామకాలకు గండి పడే అవకాశం ఉందని అప్పా ప్రతినిధులు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ సారథ్యంలో పలు ఉపాధ్యాయ అసోసియేషన్స్ విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్బంగా అప్పా ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్రం నూతనంగా అమలుచేయునున్న జాతీయ విద్యా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.