High Court on Cock fights: కోడి పందాల విషయంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కోడి పందాల నిలుపుదలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కోర్టుకు తెలపాలని రెవెన్యూ, హోంశాఖలను ఆదేశించింది. ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. గత ఆదేశాల ప్రకారం చర్యలు చేపట్టినట్లు ధర్మసనానికి తెలిపారు. ఈ క్రమంలో పిటిషనర్ తరఫు న్యాయవాది కలుగజేసుకొని.. ప్రభుత్వం చెబుతున్నది ఆచరణలో లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం.. కోడి పందాల నివారణకు ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశింది.
AP High Court: కోడి పందాల నిలుపుదలకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు - కోడి పందాలపై హైకోర్టు
High Court on Cock fights: కోడి పందాల నిలుపుదలకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
High Court on Cock fights