ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా..ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. సీజేకు దుర్గగుడి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. దర్శనం తర్వాత ఆలయ ఈవో.. సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
INDRAKEELADRI: కనకదుర్గమ్మను దర్శించుకున్న హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
విజవాడ కనకదుర్గమ్మను ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దర్శించుకున్నారు. సీజేకు దుర్గగుడి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు.
ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
కాగా అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న రద్దీ దృష్ట్యా భక్తులు సుమారు 3 గంటలపాటు నిరీక్షించారు. అయితే హైకోర్టు సీజే రాకతో వీఐపీలు బయటకు వచ్చే గేటు తాళం పగలగొట్టి అధికారులు..భక్తులను బయటకు పంపారు.
ఇదీ చదవండి:new cj of ap high court: హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం