ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం వినియోగిస్తున్న నాడు-నేడు సాఫ్ట్వేర్ను తెలంగాణకు ఇచ్చేందుకు అనుమతినిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సాఫ్ట్వేర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించుకునేందుకు వీలుగా ఏపీ అనుమతి మంజూరు చేసింది. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు సాఫ్ట్వేర్ను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించింది. టీసీఎస్ రూపకల్పన చేసిన ఈ సాఫ్ట్వేర్ను తెలంగాణాకు ఇచ్చేందుకు ఎన్వోసీ ఇస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
Nadu-Nedu: 'నాడు-నేడు' సాఫ్ట్వేర్ తెలంగాణ వాడుకునేందుకు అనుమతి - నాడు-నేడు సాఫ్ట్వేర్ను తెలంగాణ వాడుకునేందుకు అనుమతి
ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల పెంపునకు తయారు చేసిన 'నాడు-నేడు' సాఫ్ట్వేర్ను తెలంగాణ వాడుకునేందుకు ప్రభుత్వం అనుమితి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో తెలంగాణ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సాప్ట్వేర్ ఉపయోగపడనుంది.
నాడు-నేడు సాఫ్ట్వేర్ను తెలంగాణ వాడుకునేందుకు అనుమతి
TAGGED:
నాడు నేడు సాఫ్ట్ వేర్