ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్డుదారుడి సూచన మేరకే పేరు తొలగింపు - వైఎస్​ఆర్ పింఛన్ల వార్తలు

రేషన్ కార్డుల వడపోత చకచక సాగుతోంది. వేటిని తొలగించాలన్నది సంబంధిత కుటుంబ యజమాని నిర్ణయానికి ప్రభుత్వం వదిలేయనుంది. ఆ మేరకు తుది జాబితా తయారు చేసి...వచ్చే నెల నుంచి వాటి వరకే అందజేసేందుకు సిద్ధమవుతోంది.

ration cards
రేషన్ కార్డులు

By

Published : May 19, 2020, 10:14 AM IST

ఒక రేషన్‌కార్డుకు ఒకే పింఛను విధానం త్వరలో అమలులోకి రానుంది. ఒకే ఇంట్లో ఎక్కువ పింఛన్లను ఉంటే తొలగించనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారులు జాబితా రూపొందించి, క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతించిన విభాగాలకు చెందినవి మినహా మిగిలిన వాటిని తొలగించనున్నారు. వేటిని తొలగించాలన్నది సంబంధిత కుటుంబ యజమాని నిర్ణయానికి వదిలేయనున్నారు. ఆ మేరకు తుది జాబితా తయారు చేసి, వచ్చే నెల నుంచి వాటి వరకే అందజేయనున్నారు.

వీరికే మినహాయింపు
ఒక కుటుంబంలో ఒక పెన్షన్‌ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నా.. కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఆ కుటుంబంలో 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులు, కిడ్నీ, క్యాన్సర్‌, తలసేమియా, పక్షవాతం, హెచ్‌ఐవీ, తదితర విభాగాల పింఛన్లను తొలగింపు నుంచి మినహాయించనున్నారు. వారికి ఆర్థికంగా ఆసరాగా ఉండాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జిల్లాలో 5,713 పెన్షన్లు
కృష్ణా జిల్లాలో మొత్తం 4,80,823 మందికి సామాజిక భద్రతా పింఛన్లను ఇస్తున్నారు. ఇందుకు నెలకు రూ. 116.75 కోట్లను వెచ్చిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక రేషన్‌కార్డుపై ఒక్క పింఛనను మాత్రమే ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ఈ విషయంలో కొంత ఉదారత ప్రదర్శించారు. పలు చోట్ల ప్రజాప్రతినిధుల సిఫార్సులు, ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు రెండో పింఛనును కూడా మంజూరు చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి ఒకే పింఛను విధానాన్ని అమలు చేయబోతోంది.

ఇందుకు అనుగుణంగా నవశకం, ప్రజాసాధికార సర్వే, ఆధార్‌ వివరాల ఆధారంగా రెండు పింఛన్లు తీసుకుంటున్న వారి జాబితాను తయారు చేశారు. ఈ జాబితా ప్రకారం క్షేత్రస్థాయిలో పరిశీలన సాగుతోంది. పట్టణ ప్రాంతాల్లో ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా విజయవాడ నగరపాలికలో 529, పెడన పట్టణంలో 365, మచిలీపట్నంలో 357 చొప్పున ఉన్నాయి. వితంతు, వృద్ధాప్య విభాగానికి చెందినవే ఎక్కువ కనిపిస్తున్నాయి. పరిశీలనలో ఇంటింటికీ వార్డు, గ్రామ వలంటీర్లు తిరుగుతున్నారు. ఏ పింఛను తొలగించాలో కార్డుదారుడి నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వివాదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి :

ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు జూన్‌ 15 వరకు పొడిగింపు

ABOUT THE AUTHOR

...view details