ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రం, నదులలో చేపల వేటపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘించి మత్స్యకారులు చేపల వేటకు వెళ్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు సురేష్ హెచ్చరించారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ప్రతి సంవత్సరం వేట నిషేధ భృతిగా ప్రభుత్వం తరపున రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే మొదటిసారి జరిమానాగా రూ.5 వేలతో పాటు వేట నిషేధ భృతిని నిలిపివేస్తామన్నారు. నిషేద భృతి రాని వారు తమను సంప్రదించాల్సిందిగా కోరారు.
చేపల వేటపై నిషేధం..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
నదులు, సముద్రాలలో చేపల వేట కాలంపై ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు నిషేధ కాలం అమలులో ఉండనుంది. నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా వేటకు వెళితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
చేపలవేట నిషేద కాలం పై ప్రభుత్వ జీవో జారీ
TAGGED:
ఏపీలో చేపల వేట నిషేదం