దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శిగా జి.వాణీమోహన్‌ను ప్రభుత్వం నియమించింది. పురావస్తుశాఖ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆప్కో ఎండీ, సహకారశాఖ కమిషనర్‌గా బాబు.ఎ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అర్జా శ్రీకాంత్‌ను నియమించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా జి.జయలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు డెప్యుటేషన్‌పై కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్‌కు సూపర్ టైం స్కేల్ హోదా కల్పిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ కేడర్ 1996 బ్యాచ్ అధికారి అయిన లవ్ అగర్వాల్‌కు సూపర్ టైం స్కేల్ పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.