AP Employees protest : సీపీఎస్ రద్దుచేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన ఉద్ధృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇవాళ విజయవాడ వేదికగా 'సింహగర్జన' పేరుతో సభ తలపెట్టారు. ఈ సభకు పలు జిల్లాల నుంచి ఉద్యోగులు భారీగా తరలి వచ్చారు.
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పింఛన్ విధానం తీసుకురావాలని నినాదాలు చేశారు.
'సీపీఎస్ ఉద్యమం ఆరేళ్లుగా కొనసాగుతోంది. సీపీఎస్‌తో అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అధికారంలోకి వస్తే వారంలో సీపీఎస్ రద్దుచేస్తామని జగన్ అన్నారు. రెండున్నరేళ్లయినా హామీ అమలు చేయలేదు. సీపీఎస్‌పై 3 కమిటీలు ఎందుకు..? సీపీఎస్ రద్దయ్యేవరకు ఉద్యమం ఆగదు. సీపీఎస్ రద్దు మా హక్కు.. పోరాటం ఆపేది లేదు' - సీపీఎస్ ఉద్యోగుల సంఘం నేత అప్పలరాజు