ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫొని తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష

ఫొని తుపాను సన్నద్దతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో మాట్లాడారు. తుపాను గమనంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.

తుపాను సన్నద్ధతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష

By

Published : Apr 29, 2019, 4:25 PM IST

Updated : Apr 29, 2019, 6:58 PM IST

ఫొని తుపాను

ఫొని తుపానుపై కేంద్రం అప్రమత్తమైంది. ప్రభావిత రాష్ట్రాల్లోని పరిస్థితులను అనుక్షణం పరిశీలిస్తోంది. తుపాను సన్నద్దతపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విపత్తు నిర్వహణ శాఖల కార్యదర్శులతో సమీక్ష చేశారు. తుపాను గమనంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే తీరప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. నాన్​ మెకానికల్ బోట్లు మాత్రమే వేటకు వెళ్లాయని , వాటిని వెనక్కి రప్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో మాక్​డ్రిల్ చేస్తున్నారన్నారు.

తుపాను తీరందాటి భూబాగం పైకి వచ్చే అవకాశం లేదు

తుపాను తీరం దాటి భూభాగంపైకి వచ్చే అవకాశం లేదని విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వర ప్రసాద్ తెలిపారు. దక్షిణకోస్తా నుంచి ఉత్తరకోస్తా మీదుగా బంగ్లాదేశ్ వైపు వెళ్లొచ్చని,రేపు మధ్యాహ్నానికి ఒక అంచనా వస్తుందని చెప్పారు. తుపానుపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రబీలో రైతులు మద్దతుధర రూ.1,750 కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దని చెప్పారు. ఎవరైనా ధర తగ్గిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Apr 29, 2019, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details