ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఓట్ల లెక్కింపు రోజున ర్యాలీలకు అనుమతి లేదు - rally

ఎన్నికల రోజున జరిగిన గొడవలను దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపుకు పటిష్ఠ భద్రతా చర్యలను పోలీసులు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను రూపొందించుకున్నామని విజయవాడ సీపీ తెలిపారు.

సీపీ ద్వారకా తిరుమలరావు

By

Published : May 17, 2019, 6:15 PM IST

సీపీ ద్వారకా తిరమలరావు
ఈనెల 23న ఓట్ల లెక్కింపు సందర్బంగా బందోబస్తుపై విజయవాడ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. విజయవాడ పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అంతేకాక నగరంలో సున్నిత ప్రాంతాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజు నగరంలో ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదన్నారు. పాత నేరస్థులపైనా ఇప్పటికే బైండోవర్ కేసులు పెట్టామని... వారిపై నిఘా వుంటుందని సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details