విజయవాడలోని అగ్నిమాపక శాఖ ప్రధాన కార్యలయంలో ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ,అగ్నిమాపక శాఖ డీజీగా కె.అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సత్యనారయణ పీటోవో డీజీగా బదిలీ అయ్యారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించిన అనురాధ.. తాజాగా జరిగిన బదిలీలలో అగ్నిమాపకశాఖ డీజీగా స్థాన చలనం పొందారు.