చైనా రుణ యాప్‌ల కేసులో మరో కొత్తకోణం వెలుగు చూసింది. రుణయాప్‌ల కేసులో మరో కేసు నమోదైంది. నకిలీ బిల్లులతో రూ.1400 కోట్లు విదేశాలకు మళ్లించినట్లు అధికారులు తెలుసుకున్నారు. హాంకాంగ్, మారిషస్ దేశాలకు నిధులను మళ్లించినట్లుగా గుర్తించారు.
మరోవైపు బ్యాంక్ అధికారులను ఈడీ అధికారులు విచారించగా.. విదేశాలకు నిధులు మళ్లించిన విషయం బయటికొచ్చింది. లోన్ యాప్స్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈడీ ఫిర్యాదుతో సీసీఎస్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.