ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

vaccination: జూన్ చివరి నాటికి ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్: సింఘాల్

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య రెండు కోట్లను దాటిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు ఆ శాఖ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్(anil kumar singhal) వెల్లడించారు. మరోవైపు జూన్ చివరి నాటికి దాదాపు 20 లక్షల మంది ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు కూడా వ్యాక్సినేషన్(vaccination) వేయనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.

anil singhal
వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ సింఘాల్​

By

Published : Jun 9, 2021, 7:01 PM IST

Updated : Jun 9, 2021, 8:36 PM IST

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు 2 కోట్ల మార్కును దాటాయి. ఇప్పటి వరకూ 2,00,39,764 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 17 లక్షల మందికి పైగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యిందని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1 లక్షా 3 వేలుగా నమోదైనట్టు వివరించింది. మరోవైపు జూన్ చివరి నాటికల్లా రాష్ట్రంలోని ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు వ్యాక్సినేషన్(vaccination) పూర్తి చేసేందుకు కార్యాచరణ చేసినట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్(anil kumar singhal) తెలిపారు. వీరి సంఖ్య దాదాపుగా 20 లక్షల వరకూ ఉండే అవకాశముందని అన్నారు. 15 లక్షల మంది అంగన్ వాడీల్లో నమోదై ఉన్నారని... మరో నాలుగైదు లక్షల మంది నమోదు కాని వారు కూడా ఉండొచ్చన్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్​ వేస్తున్న కేంద్రాల్లోనే వీరికి వ్యాక్సిన్​ వేయాలని ఆదేశించారు. జూన్ నాటికి కేంద్రం ఏపీకి 51 లక్షల డోసుల వ్యాక్సిన్ ను సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకూ 1 కోటీ 9 లక్షల మందికి పైగా వ్యాక్సిన్​ వేశామన్నారు.

బ్లాక్ ఫంగస్ కేసులు..

రాష్ట్రంలో 1,955 బ్లాక్ ఫంగస్(black fungus) కేసులు ఇప్పటి వరకూ నమోదు అయ్యాయని.. ఇందులో 114 మంది మృతి చెందినట్టు వైద్యారోగ్యశాఖ వివరించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1301 గా ఉందని అనిల్ సింఘాల్ తెలిపారు. వీరందరికీ ఆస్పత్రుల్లో పొసకోనజోన్ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్ల ద్వారా వీరికి చికిత్స అందుతోందన్నారు. యాంఫోటెరిసిన్ బి 7 వేల డోసులను అన్ని జిల్లాలకూ పంపామన్నారు. మరోవైపు ఇవాల్టి నుంచి 12 విడత ఫీవర్ సర్వే అన్ని జిల్లాల్లోనూ మొదలు పెట్టినట్టు స్పష్టం చేశారు. ప్రతీ మూడు రోజులకోసారి ఫీవర్ సర్వే చేయిస్తున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి

Ap Corona Cases: కొత్తగా 8,766 కేసులు, 67 మరణాలు

Last Updated : Jun 9, 2021, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details