ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాంఘిక సంక్షేమ విద్యార్థుల కోసం 'అంబేడ్కర్ జీవన పథం' - undefined

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధుల కోసం... ఆ శాఖ 'అంబేడ్కర్ జీవన పథం' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన తర్ఫీదు ఇవ్వనున్నారు.

అంబేడ్కర్ జీవన పథం'

By

Published : Apr 22, 2019, 11:32 PM IST

అంబేడ్కర్ జీవన పథం'

సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్ధుల కోసం... ఆ శాఖ 'అంబేడ్కర్ జీవన పథం' పేరిట ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్షమంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంతో పాటు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన తర్ఫీదు ఇవ్వనున్నారు. వెయ్యి సాంఘిక సంక్షేమ వసతి గృహాల పరిధిలోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు.

విజయవాడలోని అంబేడ్కర్‌ భవన్‌లో కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని డిగ్రీ, పీజీ హాస్టల్‌ విద్యార్ధులు, రీసోర్స్‌ పర్సన్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంఘిక సంక్షేమశాఖ సంచాలకులు పోలా భాస్కర్‌ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. 'అంబేడ్కర్‌ జీవన పథం' కార్యక్రమ లక్ష్యాలను ఆయన వివరించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులను ఉన్నత స్థితిని తీసుకొచ్చే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details