AP JAC BOPPARAJU : ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువైందని.. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులతో కలిసి విజయవాడ రెవెన్యూ భవన్లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉన్నత అధికారులు క్రింది స్థాయి ఉద్యోగుల మీద విపరీతమైన పని ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ విషయంలో గ్రామ, వార్డు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. చట్టప్రకారం పని చేయించాలి కానీ.. ఒత్తిడి తెచ్చి పని చేయించడం సరికాదన్నారు. ఒత్తిడి పెట్టి పని చేయించుకునే వారు .. ఉద్యోగుల సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నించారు. నవంబర్ 27న విజయవాడలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరోజే నూతన కమిటీని ప్రకటిస్తామన్నారు.
గ్రామ సచివాలయ ఉద్యోగులపై పని ఒత్తిడి తెస్తున్నారు: బొప్పరాజు - రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం
BOPPARAJU : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై విపరీతమైన పని ఒత్తిడి తెస్తున్నారని.. అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ విషయంలో వారిపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు.
AP JAC BOPPARAJU