ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో... విజయవాడ ఫన్‌టైమ్స్ క్లబ్ రోడ్డులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం... రైతులు తలపెట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 6, సెక్షన్ 144 అమల్లో ఉన్నందున...ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి ప్రదర్శనలు చేపట్టవద్దన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు కొవ్వొత్తులతో శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించేందుకు తరలివచ్చారు. ఎక్కువగా వాహన రాకపోకలు లేని రహదారి అయినా పోలీసులు రోడ్డుపైకి రావొద్దని స్పష్టం చేశారు. ఈ నేపధ్యంలో నిర్వాహకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు కొందరు ప్రదర్శనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని తెలిపినా... పోలీసులను తమను అడ్డుకోవటం భావ్యం కాదన్నారు.
'శాంతియుతంగా నిరసన తెలిపినా అడ్డుకుంటారా?' - amaravathi capital issue latest
విజయవాడ ఫన్ టైమ్స్ క్లబ్ రోడ్డులో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మహిళలు తలపెట్టిన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రజాస్వామ్యయుతంగా తలపెట్టిన నిరసనను అడ్డుకోవటం తగదని ఆవేదన వ్యక్తం చేశారు.
'శాంతియుతంగా నిరసన తెలిపినా అడ్డుకుంటారా?'