కరోనా నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మంత్రులు, నాయకులు మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అమరావతి జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న రాజధాని అంశాలపై మాట్లాడుతూ కోర్టు ధిక్కరణలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం రైతులు 33వేల ఎకరాల భూమిని త్యాగం చేస్తే.. వారి త్యాగాలను వైకాపా నేతలు అపహాస్యం చేశారని మండిపడ్డారు. ఆస్పత్రుల్లో సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి సమస్యలు పరిష్కరించి, మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
కరోనా నుంచి దృష్టి మరల్చేందుకే తెరపైకి మూడు రాజధానుల అంశం: పద్మశ్రీ - padmasri fire on YCP government about three capital issue
మూడు రాజధానుల అంశంపై వైకాపా నేతల తీరుపై అమరావతి జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను కట్టడి చేయలేక, మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
అమరావతి జేఏసీ నాయకురాలు సుంకర పద్మశ్రీ