రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 16 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు.. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతులు నిలిపివేసింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో లక్షా 39 వేల సీట్లకు ఆమోదం తెలిపింది. గతేడాది 274 కళాశాలలకు అనుమతలివ్వగా.. ఈసారి 258 విద్యాసంస్థలకు మాత్రమే ఆమోదం తెలిపింది.
కృత్రిమ మేథ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ లాంటి తొమ్మిది కొత్త కోర్సుల్లో ఈ ఏడాది 6వేల 660 సీట్లు పెరిగాయి. కొన్ని కళాశాలలు కొత్త కోర్సులకు దరఖాస్తు చేయడంతో అనుమతులు లభించాయి. కొన్ని ప్రైవేటు కళాశాలలకు అనుమతులు నిలిపివేయడంతో సీట్ల సంఖ్య తగ్గింది. ఏఐసీటీఈ ఆమోదించిన జాబితా ప్రకారం... అత్యధికంగా గుంటూరు జిల్లాలో 21వేల 435 సీట్లు ఉండగా... శ్రీకాకుళంలో అత్యల్పంగా 2వేల 940 సీట్లు ఉన్నాయి.