అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను పరిష్కరించేందుకు మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. ప్రజలకు నష్టం కలిగించేలా పుట్టుకొస్తున్న అగ్రిగోల్డ్ లాంటి కంపెనీలను పూర్తిగా నిషేధించాలని ముఖ్యమంత్రి జగన్ ను విజయవాడలో కోరారు. సమస్య పరిష్కారం కోసం 11వందల50 కోట్లు విడుదల చేయాలన్న నిర్ణయం హర్షనీయమన్నారు. అంతటితోనే సమస్య పరిష్కారం కాదని.. ప్రతి బాధితుడుకి సక్రమంగా ఆ నిధులు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనేకమంది బాధితుల వద్ద రశీదులు లేనందువల్ల కంపెనీ డేటాను ప్రామాణికంగా తీసుకుని చెల్లింపులు చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
సీఎం నిర్ణయం హర్షనీయం.. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం
అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు 1150కోట్లు విడుదల చేయాలన్న మంత్రివర్గ నిర్ణయం హర్షనీయమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు అన్నారు. ప్రతి బాధితుడికి సక్రమంగా డబ్బులు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీఎం నిర్ణయం హర్షనీయం: అగ్రిగోల్డ్ బాధితుల సంఘం
TAGGED:
agri gold