అగ్రిగోల్డ్ డైరెక్టర్ హేమసుందర వరప్రసాద్ అరెస్టు - hemasundar varaprasad
అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన హేమసుందర వరప్రసాద్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. పలు ప్రాంతాల్లో బినామీ ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అగ్రిగోల్డ్ సంస్థకు డైరక్టర్ గా వ్యవహరించిన అవ్వా హేమ సుందర వరప్రసాద్ బినామీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయంపై.. ప్రత్యేక దృష్టి పెట్టిన సీఐడీ అధికారులు వరప్రసాద్ ను అరెస్టు చేశారు. కేసులో ఏ6 గా ఉన్న ఆయన.. బినామీ పేర్లతో కోట్ల రూపాయల ఆస్తులను కొన్నట్టు గుర్తించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పేర్లు మార్చుకుని నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించాడు. అవ్వా లక్ష్మీ నృసింహ భారతి, లక్ష్మీ నరసింహ భారతి, లక్ష్మీ నరసింహ ప్రసాద్ శర్మ ఇలా రకరకాల పేర్లతో చెలామణి అయ్యాడు. కృష్ణా జిల్లాలో పటమట, గన్నవరం, కంకిపాడు, గుండాల, నూజివీడు ప్రాంతాల్లో బినామీ పేర్లతో 7.32 కోట్ల రూపాయల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.