ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేదెన్నడు?'

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు జులై 15న రాష్ట్ర ప్రజాప్రతిధులు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే 22 నుంచి నిరవధిక దీక్ష చేపట్టనున్నామన్నారు.

Agrigold Customers and Agents Welfare Association
అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్

By

Published : Jul 6, 2021, 6:03 PM IST

రాష్ట్రంలోని 13 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. జులై 15న రాష్ట్ర ప్రజాప్రతిధులు, మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. 22 నుంచి 30 వరకు విజయవాడలో నిరవధిక రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామన్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే 31న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి విజ్ఞాపన యాత్ర చెప్పట్టనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వర రావు స్పష్టం చేశారు. విజయవాడలోని దాసరి భవన్ లో వీరు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

తక్షణమే హైపవర్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి నిధులను కేటాయించి, బాధితులందరికీ న్యాయం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మూడు వారాల్లో చెల్లింపులు చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. 101 వారాలు గడిచినా పరిష్కరించలేదని విమర్శించారు. రూ.1,150కోట్ల కేటాయింపులు ప్రకటనలకే పరిమితమయ్యాయి తప్ప.. బాధితులకు ఏ మేలూ జరగలేదని ఆరోపించారు. కరోనాను కూడా లెక్కచేయకుండా పోరాటాలకు పదునుపెడతామని ఆయన హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details