ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఏజీ వ్యాఖ్యలు హైకోర్టు తీర్పును ధిక్కరించేలా ఉన్నాయి'

ఎస్ఈసీ వ్యవహారంలో ఏజీ శ్రీరాం వ్యాఖ్యలు... హైకోర్టు తీర్పును ధిక్కరించేలా ఉన్నాయని.... తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అన్నారు. న్యాయ సలహాదారుగా ఉండి ఇలా చేయడం తగదని విమర్శించారు.

tdp mp kanakamedala ravindera
తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్

By

Published : May 31, 2020, 1:23 PM IST

నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పును ఏజీ శ్రీరాం అడ్డుకోవడం మంచి పరిణామం కాదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అభిప్రాయడపడ్డారు. ఏజీ వాదనలో పస లేదన్న ఆయన... న్యాయ సలహాదారుగా ఉండి ఈ విధంగా చేయడం తగదని విమర్శించారు. ఆర్డినెన్స్ చెల్లదు అని హైకోర్టు చెప్పాక తీర్పు సరిగా లేదని ఏజీ చెప్పడం సరికాదన్నారు. కావాలంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లాలి కానీ... ఏజీ ద్వారా మీడియా సమావేశం ఎలా నిర్వహిస్తుందని నిలదీశారు.

న్యాయస్థానం ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం దుర్మార్గమన్న కనకమేడల.... ప్రభుత్వం ఏజీ కార్యాలయాన్ని కూడా దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు. హైకోర్టు తీర్పులకు వక్రభాష్యం చెప్తున్నారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details