ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Atchenna on Mining: మావోయిస్టుల లేఖపై వైకాపాది తప్పుడు ప్రచారం: అచ్చెన్నాయుడు

Atchenna on Mining: విశాఖ మన్యంలో బాక్సైట్​ తవ్వకాలు ఆపకపోతే తీవ్రమైన పరిణామాలుంటాయని మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. అయితే ఆ లేఖ వెనక తెదేపా హస్తముందని వైకాపా నేతలు ఆరోపించడాన్ని అచ్చెన్నాయుడు తప్పుపట్టారు. రాష్ట్రంలో జరిగే ప్రతి విషయానికి చంద్రబాబే కారణమని ఆరోపిస్తున్నారని ఎద్దేవా చేశారు.

Achennaidu
Achennaidu

By

Published : Mar 10, 2022, 9:01 AM IST

మైనింగ్ పై మావోయిస్టుల లేఖపై వైకాపాది తప్పుడు ప్రచారం -అచ్చెన్నాయుడు

Atchenna on Mining : అక్రమ మైనింగ్​పై మావోయిస్టులు విడుదల చేసిన లేఖ వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే ప్రతి దాని వెనుక తెదేపా ఉందని చెప్పడం అలవాటు అయ్యిందని దుయ్యబట్టారు.

బాధ్యత ఉంది కనుకే అక్రమ మైనింగ్​పై మావోయిస్టులు ప్రకటన చేశారని.., దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఏజెన్సీలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న విషయం అందరికి తెలుసని.. పరిశీలనకు తాము కూడా వెళ్ళామని గుర్తు చేశారు. ప్రతీ విషయానికీ చంద్రబాబే కారణమని వైకాపా నేతలు మాట్లాడతారని ఎద్దేవా చేశారు.

మావోయిస్టుల లేఖ..

లేటరైట్‌ ముసుగులో విశాఖ మన్యంలో బాక్సైట్‌ను ప్రజాప్రతినిధుల అండదండలతో బడాబాబులు దోచుకుంటున్నారని, దీన్ని విద్యార్థి, ప్రజాసంఘాలు అడ్డుకోవాలని సీపీఐ మావోయిస్టు విశాఖ ఈస్ట్‌ డివిజన్‌ కార్యదర్శి అరుణ పేరిట లేఖ విడుదలైంది. విశాఖ జిల్లా జీకే వీధి మండలం చాపరాతిపాలెంలో లక్షలాది రూపాయలు తీసుకుని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి లేటరైట్ ముసుగులో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు.

బాక్సైట్‌ తవ్వకాలను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో 11 వేల హెక్టార్ల భూమిలో ఉన్న ఖనిజ నిక్షేపాలపై నాయకుల కళ్లు పడ్డాయని పేర్కొన్నారు. భద్రాచలానికి చెందిన అజయ్‌కుమార్ అనే వ్యాపారికి కోట్లాది రూపాయల విలువైన బాక్సైట్‌ను లేటరైట్‌ ముసుగులో దోచి పెడుతున్నారని ఆరోపించారు. 'అక్రమ తవ్వకాలు ఆపండి లేదా మన్యం వదిలిపొండి' అని హెచ్చరించారు. లేదంటే గతంలో ఎమ్మెల్యేలకు పట్టిన గతే పడుతుందంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.

ఇదీ చదవండి :

Amaravathi News: కొత్త రాజధానిలో సంస్థల ఏర్పాటు బాధ్యత కేంద్రానిది కాదా?

ABOUT THE AUTHOR

...view details