ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖపై కేంద్ర హోంశాఖ స్పందించింది. ఈమేరకు హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్ నిగమ్.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్రమైన అభియోగాలు, ఆరోపణలు ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను సంబంధింత విభాగం పరిశీలిస్తోందని హోంశాఖ పేర్కొంది. అఖిలభారత సర్వీసు నిబంధనలు 1969 రూల్ 3(1) ప్రకారం సంబంధిత అధీకృత విభాగం ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ధృవీకరిస్తున్నట్టు తెలియచేసింది. ఏప్రిల్ 7 తేదీ లోగా ఆయన పై అభియోగపత్రం దాఖలు చేయాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.
'ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ధ్రువీకరిస్తున్నాం'
అఖిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను ధ్రువీకరిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఏప్రిల్ 7వతేదీలోగా ఆయనపై అభియోగపత్రం దాఖలు చేయాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్