విజయవాడ(vijayawada) నగర శివారులోని రాజీవ్ నగర్లో ఓ యువకుడు గంజాయి(cannabis) మత్తులో హల్చల్ చేశాడు. నాలుగు అంతస్తుల భవనం పైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు. భయాందోళనకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది... చాకచక్యంగా యువకుడికి కిందకు దింపారు. అనంతరం యువకుడిని పోలీసులు నున్న పోలీస్ స్టేషన్కు తరలించారు.
గంజాయి మత్తులో యువకుడు హల్చల్ - vijayawada updates
విజయవాడ(vijayawada)లో గంజాయి మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. నాలుగు అంతస్థుల భవనంపైకి ఎక్కి దూకుతానని బెదిరించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
యువకుడు హల్చల్