ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమాయకులను నమ్మబలుకుతాడు... అందినకాడికి దోచుకుంటాడు - crime news in krishna district

పరిచయాలు పెంచుకుంటాడు. నమ్మబలుకుతాడు. నేవీలో ఉద్యోగాలంటూ మాయ మాటలు చెబుతాడు. తాను నేవీ కమాండర్​గానూ పని చేశానని గొప్పలు చెప్పేస్తాడు. నమ్మించేందుకు ఫేక్ ఐడీ కార్డులను చూపిస్తాడు. అంతేకాదు.. గతంలో నేవీ అధికారిని అని చెప్పి ఓ మహిళను పెళ్లి చేసుకోని మోసానికి పాల్పడ్డాడు.

person arrested
person arrested

By

Published : Jun 20, 2020, 9:51 AM IST

నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి, అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యక్తిని విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం కూచివారిపల్లెకు చెందిన పెండెల హరీష్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. సామాజిక మాధ్యమాల ద్వారా అతనికి జి.ఎస్‌.ఎస్‌.చలపతిరావు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.

తాను నేవీలో కమాండర్‌ అని పరిచయం చేసుకొని, నేవీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. సుమారు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని చెప్పాడు. అతని మాటలు నమ్మిన హరీష్‌ ముందుగా రూ.1.20 లక్షలు ఆన్‌లైనా ద్వారా పంపించాడు. మిగిలిన నగదు త్వరగా ఏర్పాటు చేయాలని చలపతిరావు ఒత్తిడి చేశారు. అతని మాటలకు అనుమానం వచ్చి హరీష్‌ చలపతిరావు గురించి కనుక్కున్నాడు.

సదరు వ్యక్తి గతంలో విశాఖపట్నంలో ఇలాగే చాలా మందిని మోసం చేసిన కేసులో అరెస్టు అయినట్లు తేలింది. నిందితుడు విజయవాడలో ఉంటున్నట్లు తెలుసుకుని, వెంటనే స్థానిక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు రంగంలోకి దిగి హైదరాబాద్‌ కొండాపూర్‌కు చెందిన గాది సత్య సూర్య చలపతిరావు అలియాస్‌ శశికాంతరావు (34)ను విజయవాడ సమీప పెనమలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను చేసిన మోసాలు వెలుగుచూశాయి.

ఘనతలు ఎన్నో...

  • చలపతిరావు విశాఖపట్నంలో నేవీ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పి.. 2012లో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు.
  • 2016లో కొంత మందితో పరిచయం ఏర్పర్చుకొని వారికి నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి సుమారు రూ.15 లక్షల వరకు వసూలు చేశాడు. మోససోయిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ న్యూపోర్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అతడిని అరెస్టు చేశారు.
  • 2018లో మళ్లీ కొంత మందిని మోసం చేయడంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విశాఖ టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
  • నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చినా, తన నేర ప్రవృత్తిని మానకుండా, మకాంను హైదరాబాద్‌కు మార్చాడు. అక్కడ కొంత మందికి నకిలీ ఐడీ ప్రూఫ్‌లు చూపించి తను నేవీలో అధికారిని అని చెప్పి సుమారు రూ.5 లక్షలు నగదును వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు.
  • నిందితుడు సామాజిక మాధ్యమాల ద్వారా మహిళలు కొత్త వ్యక్తులతో తాను నేవీలో కమాండర్‌గా పనిచేస్తున్నానని పరిచయం ఏర్పరుచుకుని వారిని వివిధ రకాలుగా మోసం చేశాడు.

-

ఇదీ చదవండి:

సరిహద్దుల్లో సమర ధ్వని.. రంగంలోకి వాయుసేన

ABOUT THE AUTHOR

...view details