ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

1500 కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ - ఏపీ లాక్​డౌన్ వార్తలు

విజయవాడ శివారులోని అంబాపురం గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త గండికోట సీతారామయ్య సేవాగుణాన్ని చాటుకున్నారు. తమ గ్రామంలోని 1500 కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసరాలు పంపిణీ చేశారు.

a man distributed Essential commodities to all the families in his village
a man distributed Essential commodities to all the families in his village

By

Published : Mar 27, 2020, 3:41 PM IST

1500 కుటుంబాలకు ఉచితంగా నిత్యావసరాలు పంపిణీ

కరోనాపై పోరులో భాగంగా రాష్ట్రమంతా లాక్​డౌన్ విధించిన నేపథ్యంలో విజయవాడ నగర శివారు అంబాపురం గ్రామంలోని 1500 కుటుంబాలకు స్థానిక ప్రజా ప్రతినిధి, సామాజిక కార్యకర్త గండికోట సీతారామయ్య నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 20 కేజీల బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందజేశారు. గ్రామంలో తిరుగుతూ కరోనా వైరస్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం చెప్పే వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని గ్రామస్థులకు సూచించారు. తమ గ్రామం పచ్చగా, పరిశుభ్రంగా ఉండాలనే తలంపుతో కరోనా వైరస్​పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని గండికోట సీతారామయ్య చెప్పారు.

ఇదీ చదవండి: స్వీయ నిర్బంధంలో తినకూడనవి ఇవే...

ABOUT THE AUTHOR

...view details