- 'నెలలో కోటి మందికి టీకాలు వేయాలి'
రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యచరణపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ టీకాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా టీకాల పంపిణీలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను అధికారులు సీఎంకు వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మహమ్మారి విస్తరణ
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ ప్రభావం పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 585 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,95,121కి చేరింది. కొవిడ్ కారణంగా నలుగురు మృతి చెందారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- లేఖలు నిజమే: పీఎంవో
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రధానికి రెండుసార్లు లేఖ రాయటాన్ని పీఎంవో నిర్థారించింది. దీనిపై స్పందించిన పీఎంవో నిర్ణీత గడువులోగా సరైన సమాధానం పంపాలని సంబంధిత విభాగానికి సూచించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నామినేషన్ దాఖలు
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక తెదేపా అభ్యర్థిగా పనబాక లక్ష్మి నామినేషన్ వేశారు. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'కాంగ్రెస్ వస్తే చొరబాట్లు, అవినీతి'
అసోంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చొరబాట్లు, అవినీతి పెరుగుతాయని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఓటర్లను హెచ్చరించారు. అసోం ప్రత్యేకతను నాశనం చేయాలనే లక్ష్యంతో ఉన్న ఏఐయూడీఎఫ్తో కాంగ్రెస్ చేతులు కలిపిందని విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- బిల్లుకు ఆమోదం