ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రప్రదేశ్​ ప్రధాన వార్తలు

.

9pm_Topnews
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Mar 10, 2021, 8:58 PM IST

  • 62.28 శాతం పోలింగ్
    రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 12 నగరపాలక, 71పురపాలక, నగర పంచాయతీల్లో సాయంత్రం 5 గంటల వరకు 62.28 శాతం పోలింగ్‌ నమోదైంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఉద్రిక్తతల పర్వం
    నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో పోలింగ్‌ ముగిసింది. 12 నగరపాలక, 71 పురపాలక, నగర పంచాయతీల్లో ఇవాళ పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కొన్నిచోట్ల బాహాబాహీకి దిగాయి. పోలీసులు జోక్యం చేసుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఓటమి భయంతోనే'
    వైకాపాపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే వైకాపా దాడులు తెగబడుతోందని విమర్శించారు. దాడులు, దౌర్జన్యాలతో ఓటర్లను భయపెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తా'
    సీఎం జగన్‌ను ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి కలిశారు. ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తానని సుబ్రహ్మణ్యస్వామి స్పష్టం చేశారు. తితిదే ఖాతాలను కాగ్‌తో ఆడిట్ చేయించాలన్న సీఎం నిర్ణయం బాగుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • అస్తిత్వ పోరు
    ఓవైపు దూసుకొస్తున్న భాజపా సునామీ.. మరోవైపు సొంత పార్టీని వరుసపెట్టి వీడుతున్న నేతలు... నిరుద్యోగంపై ప్రజల్లో ఆందోళన.. ఇన్ని సమస్యల మధ్య ఎన్నికలకు వెళుతోంది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్​ కాంగ్రెస్​. బంగాల్​లో భాజపాను అడ్డుకునేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 26న 'భారత్​ బంద్​'
    నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఆందోళనలు ఈ నెల 26తో నాలుగు నెలలు పూర్తి చేసుకుంటాయి. ఈ సందర్భంగా ఆ రోజున భారత్​ బంద్​కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిబంధనకు చెక్​
    ట్రంప్​ హయాంలోని కీలక గ్రీన్​కార్డు నిబంధనలపై కోర్టుల్లో ఉన్న కేసులను వెనక్కి తీసుకుంది జో బైడెన్​ యంత్రాంగం. ఫుడ్​ స్టాంప్​ వంటి ప్రజా సేవలు పొందే వలసదారులకు గ్రీన్​కార్డు మంజూరు చేయకూడదన్నది ట్రంప్​ నిబంధన. దీనికి వ్యతిరేకంగా అమెరికా కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఇళ్ల విక్రయాలు డౌన్!
    దేశీయంగా గృహ విక్రయాలు 2020-21లో 34 శాతం తగ్గొచ్చని ఫిచ్​ అనుబంధ సంస్థ ఇండియా రేటింగ్స్​ తాజా నివేదికలో వెల్లడించింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం మాత్రం మళ్లీ డిమాండ్ సాధారణ స్థితికి చేరొచ్చని అంచనా వేసింది. మారిన ఈ పరిస్థితులను తట్టుకునే శక్తి గ్రేడ్​ 1 స్థిరాస్తి సంస్థలకు ఉందని వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రెండోస్థానానికి కోహ్లీసేన
    అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) టీ20 టీమ్ ర్యాంకింగ్స్​తో పాటు టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. టీ20 టీమ్ ర్యాంకింగ్స్​లో టీమ్​ఇండియా రెండోస్థానానికి దూసుకెళ్లింది. మరోవైపు ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో అద్భుతంగా రాణించిన బ్యాట్స్​మన్​ రిషబ్​ పంత్​, స్పిన్నర్​ అశ్విన్​ మెరుగైన స్థానాల్లో నిలిచారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • వివాదంపై స్పందన
    'లవ్​స్టోరీ' సినిమాలోని 'సారంగదరియా' పాట వివాదంపై స్పందించిన చిత్ర దర్శకుడు శేఖర్​ కమ్ముల.. ఈ పాట పాడాల్సిన కోమలికి తగిన న్యాయం చేస్తానని స్పష్టం చేశారు. ఈ గీతాన్ని ఎందుకు గాయని మంగ్లీతో పాడించాల్సి వచ్చిందో ఈ సందర్భంగా వివరించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details