ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

.

9pm_Topnews
ప్రధాన వార్తలు @ 9pm

By

Published : Mar 7, 2021, 8:59 PM IST

  • అమరావతిని కాపాడుకునే బాధ్యత మీకు లేదా?: చంద్రబాబు
    అమరావతి ఆంధ్రుల హక్కు అని.. రాజధాని పరిరక్షణ కోసం అందరూ పోరాడాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. అమరావతి కోసం విజయవాడలో ఇంటికొకరు రావాలని కోరారు. అమరావతిని కాపాడుకునే బాధ్యత మీకు లేదా? అని ప్రజల్ని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • రాజధాని పేరుతో విజయవాడ, గుంటూరును నాశనం చేశారు: పేర్ని నాని
    తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి నాని విమర్శలు గుప్పించారు. రాజధాని పేరుతో గుంటూరు, విజయవాడ నగరాలను నాశనం చేశారని ఆరోపించారు. విజయవాడ నగరంలో ఒక్క బైపాస్ నిర్మాణమైనా చేశారా అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకు ప్రజలు బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'భాజపాకు అవకాశం ఇస్తే.. మూడేళ్లలోనే అమరావతిని నిర్మిస్తాం'
    స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా బలవంతపు ఏకగ్రీవాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాకు అవకాశమిస్తే మూడేళ్లలోనే అమరావతిని నిర్మిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!
    ఒకే అమ్మకడుపున పుట్టినా... ధన వ్యామోహంలో పేగు బంధాన్ని మర్చిపోయాడు. సొంత అన్న, అక్కను కర్కశంగా హత్య చేసి రక్తబంధాన్ని తెంచాడు. ఆస్తి కోసం తమ్ముడు తన తోబుట్టువులనే విచక్షణారహితంగా నరికిచంపిన ఘటన.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం రేపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'బంగారు బంగాల్' కల నెరవేరబోతోంది: మోదీ
    తాము అధికారంలోకి వస్తే బంగారు ​బంగాల్​ను నిర్మిస్తామని ప్రధాని మోదీ హామీనిచ్చారు. బంగాల్‌ను అభివృద్ధి చేస్తారంటూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మమతా బెనర్జీ వమ్ము చేశారని విమర్శించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి బంగాల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'చట్టాల రద్దుకు 100 నెలలు పట్టినా రైతులతోనే'
    వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులతో కలిసి చివరి వరకు పోరాడతామన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. చట్టాలను ఉపసంహరించేంత వరకు పోరాటం విరమించేది లేదని మేరఠ్​ సభలో తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఇరు దేశాలు ఆధిపత్య ధోరణి వీడాలి'
    భారత్, చైనా ఒకదానినొకటి విలువ తగ్గించుకోవటం, అనుమానపడటం వంటి చర్యలను విడనాడాలన్నారు చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యి. రెండు మిత్ర దేశాలని, ఇరు దేశాల అభివృద్ధికి పరస్పరం సహకరించుకోవాలని చెప్పారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చమురు ధరలు, ఆర్థిక గణాంకాలే ఈ వారం కీలకం!
    ఈ వారం స్టాక్ మార్కెట్లకు అమెరికా బాండ్ మార్కెట్లు, ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటితో పాటు ముడి చమురు ధరలూ మార్కెట్లను ప్రభావితం చేసే ప్రధానాంశంగా విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • ప్రపంచ నం.1​​గా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​
    మాటియో పెల్లికోన్​ ర్యాంకింగ్​ సిరీస్​లో భారత మహిళా రెజ్లర్​ వినేశ్​ ఫొగాట్​ మెరిసింది. ఆదివారం జరిగిన ఫైనల్​లో కెనడాకు చెందిన డైనా మేరీ హెలెన్​ను ఓడించి స్వర్ణ పతకాన్ని సాధించింది. వారం రోజుల వ్యవధికి ఆమెకిది రెండో బంగారు పతకం కావడం విశేషం. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'చరిత్రను కించపరిచేందుకే 'తెర'పైకి గంగూబాయ్'
    గంగూబాయ్​ సినిమా ద్వారా తమ ప్రాంతానికి ఉన్న 200ఏళ్ల వాస్తవ చరిత్రను కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కామతిపుర నివాసులు. ఈ చిత్రం ద్వారా ప్రస్తుత, భవిష్యత్​ తరాలపై ప్రభావం పడే అవకాశముందని వాపోయారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details